Dil Raju: ఎఫ్.డి.సి. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు..! 4 d ago
రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సినీ నిర్మాత దిల్ రాజ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తానని, తెలంగాణలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తానని దిల్ రాజు వెల్లడించారు.